: అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ కొంచెం సేపటి క్రితం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, సబిత, శ్రీలక్ష్మి, రాజగోపాల్ కూడా కోర్టుకు హాజరయ్యారు. కాగా, ఈ కేసు విచారణ వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసనట్టు సమాచారం. కాగా, బెయిల్ రద్దు పిటిషన్ పై జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు కొంచెం సేపట్లో ప్రారంభం కానున్నాయి.