: ధనుష్ కు ఊరట... కదిరేశన్ దంపతుల పిటిషన్ కొట్టివేత


దక్షిణాది నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ తమ బిడ్డేనని, తప్పిపోయాడని, ఇప్పుడు అతన్నుంచి తమ పోషణ నిమిత్తం నెలకు కొంత డబ్బు ఇప్పించాలని కదిరేశన్, మీనాక్షి దంపతులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణలో దశలో, ధనుష్ తన శరీరంపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేశారని డాక్టర్లు నివేదిక ఇవ్వడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ధనుష్ ఇబ్బందుల్లో పడ్డాడని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇక తాజాగా మద్రాస్ హైకోర్టు కదిరేశన్ దంపతుల పిటిషన్ ను కొట్టివేస్తూ, కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఏఏ కారణాలు చూపుతూ కదిరేశన్ పిటిషన్ కొట్టేశారన్న విషయాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News