: చూపుల్లో, ఆలోచనల్లో సానుకూలత ఉండాలే తప్ప, కోరిక, వాంఛ వుండకూడదు!: మగవారికి రవీనాటాండన్ సూచన


గతంలో బాలీవుడ్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసి, ఆపై తెలుగులోనూ సినీ అభిమానులకు దగ్గరైన రవీనాటాండన్, ఆడపిల్లలను ఉద్దేశించి ఓ లేఖ రాసింది. అత్యాచారాలు జరిగినట్టు వార్తలు వింటుంటే, తన రక్తం మరిగిపోతూ ఉంటుందని, అవి ఆగాలంటే, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాల్సి వుందని అభిప్రాయపడింది. ఆడపిల్లల్ని అర్థం చేసుకోవాలని మగవారికి సూచిస్తూ, చూపుల్లో, ఆలోచనల్లో సానుకూలత ఉండాలే తప్ప, కోరిక, వాంఛ తగదని సలహా ఇచ్చింది.

"ప్రియమైన ఆడపిల్లల్లారా..!" అని తన లేఖను ప్రారంభించిన రవీనా, ఆడపిల్లలను తాకాలని చూసేవారు, వెకిలిగా మాట్లాడేవారు, వేధించే వారినుంచి రక్షణ కల్పించడంలో సమాజం విఫలమైందని ఆరోపించింది. ఆడవాళ్ల రక్షణ ఆడవాళ్ల చేతుల్లోనే ఉందని, సమస్య ఎదురైన వేళ, న్యాయం కోసం మాట్లాడాలని చెప్పింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ధైర్యాన్ని నూరిపోయాలని, మగపిల్లలుంటే, అమ్మాయిలను గౌరవించడం నేర్పాలని వెల్లడించింది. ఏదైనా దారుణాన్ని ఎదుర్కొన్న మహిళలకు మద్దతుగా నిలవాలని ఆశించింది. తన లేఖకు "ఇట్లు, ఆందోళన చెందుతూ... ఓ అమ్మ" అంటూ ముగింపును ఇచ్చింది.

  • Loading...

More Telugu News