: పులివెందుల నుంచి లోకేష్ పోటీకి రెడీ: బుద్ధా వెంకన్న


వైఎస్ జగన్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ పోటీ చేస్తారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. లోకేష్ ను గెలిపించుకునే సత్తా తమకుందని, ఈ సవాల్ కు వైకాపా సిద్ధంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైఎస్ కుటుంబంలోని ముఖ్యులందరూ ఒక్కొక్కరుగా ఎన్నికల్లో ఓడిపోతున్నారని, ఆయన కుటుంబంపై ప్రజలకు నమ్మకం లేదనడానికి ఇదే సాక్ష్యమని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో వైఎస్ విజయమ్మ, కడపలో వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారని, ఇక తరువాతి వంతు జగన్ దేనని బుద్ధా వెంకన్న అన్నారు.

  • Loading...

More Telugu News