: 11 ఏళ్లలో ఎంత మార్పు...అనామకుడి నుంచి స్టార్ గా మారిన బాలీవుడ్ హీరో


11 ఏళ్లలో అనామకుడి స్థాయి నుంచి బాలీవుడ్ స్టార్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎదిగాడు. త్వరలో ఐఫా అవార్డు ప్రదానోత్సవంలో స్టేజ్ షో ఇవ్వనున్న సందర్భంగా ఐఫాతో తనకు గల అనుబంధాన్ని పంచుకున్నాడు. తన డాన్సింగ్ కెరీర్ ఐఫా అవార్డు ప్రదానోత్సవంతోనే మొదలైందని అన్నాడు. 2006లో తొలిసారి ఐఫా ప్రదానోత్సవంలో పాల్గొన్నానని అన్నాడు. అయితే అప్పుడు స్టేజ్ షో బ్యాక్ డాన్సర్లలో ఒకడిగా పాల్గొన్నానని తెలిపాడు. ఇప్పుడు మాత్రం స్టార్ గా పాల్గొంటున్నానని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తెలిపాడు.  ఇందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపుతెచ్చుకున్నాడు. ధోనీ సినిమాతో స్టార్ గా మారిపోయాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి నుంచి, స్టార్ హీరోగా గుర్తింపుతెచ్చుకున్న వర్ధమాన నటుడిగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News