: అమరావతిపై హరిత ధర్మాసనంలో ముగిసిన వాదనలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ధర్మాసనం (ఎన్టీటీ)లో పండలనేని శ్రీమన్నారాయణ, బోలిశెట్టి సత్యనారాయణ, ఈఏఎస్ శర్మలు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. రెండేళ్లపాటు వాదనలు కొనసాగగా తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ఎన్టీటీ పేర్కొంది. కాగా, అమరావతి నగరాన్ని ఎంత విస్తీర్ణంలో చేపడుతున్నారు? నిర్మాణ ప్రాంతం, జల వనరులకు సంబంధించిన వివరాలన్నీ సమర్పించాలని ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్, సభ్యులు జస్టిస్ రఘువేంద్ర సింగ్ రాథోడ్, బ్రిక్రంసింగ్ సజ్వానలతో కూడిన ధర్మాసనం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదేశించింది.