: టీఆర్ఎస్‌లో హరీశ్‌రావుకు అవమానాలు.. ఆయన కాంగ్రెస్‌లోకి రావడమే బెటర్: కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్‌రావు
కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి పనిమంతుడైన మంత్రి హరీశ్‌రావుకు టీఆర్ఎస్‌లో అవమానాలు ఎదురవుతున్నాయని, వాటిని భరిస్తూ ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. టీఆర్ఎస్‌లో ముసలం పుట్టిందని, హరీశ్‌ను పక్కన పెట్టారని అన్నారు. మంచివాడైన హరీశ్ కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని అన్నారు. హరీశ్‌రావుకు కాంగ్రెస్ పార్టీనే సరైనదని పేర్కొన్న ఉమేశ్‌రావు ఆయన రాకతో కాంగ్రెస్ కూడా లాభపడుతుందని అభిప్రాయపడ్డారు. హరీశ్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.