: హాల్ టికెట్ కావాలంటే నాతో ఒక రాత్రి గడుపు: అధ్యాపకుడి వివాదాస్పద డిమాండ్


నైతిక విలువలు నేర్పాల్సిన గురువు కామంతో కళ్ళు మూసుకుపోయి వ్యవహరించి, చివరికి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ లోని ఒక పాలిటెక్నిక్‌ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 13న పరీక్ష జరిగిన సందర్భంగా ఒక యువతి చూసిరాతకు పాల్పడుతుండగా, ఇన్విజిలేటర్ గా విధులు నిర్వర్తించిన ఆ కాలేజీ అధ్యాపకుడు అమిత్‌ గన్వీర్‌ ఆమెను పట్టుకున్నాడు. ఆమె నుంచి గుర్తింపు కార్డు, హాల్‌ టికెట్‌, మొబైల్‌ ఫోన్‌ తీసేసుకున్నాడు.

ఆమె బతిమాలడంతో వాటిని తిరిగి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని, ఒక రాత్రి తనతో గడపాలంటూ అసంబద్ధమైన కోరిక కోరాడు. దీంతో ఆ యువతి తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు వివరించి, వారి సాయంతో అంబజరి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. దీంతో కీచక అధ్యాపకుడిని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేశారు. ఇది తెలియడంతో శివసేన, యువక్రాంతికి చెందిన కార్యకర్తలు ఆగ్రహంతో కళాశాలకు చేరుకుని, యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్‌ ముఖానికి ఇంకు పూశారు.

  • Loading...

More Telugu News