: వల్లభాయ్ పటేల్ చెప్పిన 'స్టీల్ ఫ్రేమ్' బలహీనపడిందా?: ఐఏఎస్ లతో రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
'దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సివిల్ సర్వీసెస్ ను ‘స్టీల్ ఫ్రేం’గా అభివర్ణించారు. మరి ఇప్పుడు ఆ స్టీల్ ఫ్రేం బలహీనపడిందా?' అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఏఎస్ అధికారులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'ఇది కొంచెం బాధాకరమైన విషయం... ఉదయం 9.45 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. నేను మాత్రం కార్యక్రమ ప్రారంభానికి 5 నిమిషాల ముందే చేరుకున్నాను. అయితే కార్యక్రమం మాత్రం 9.57కు ప్రారంభమైంది... ఇది బాధాకరమైన విషయం కాదా? అని అడిగారు. సర్థార్ పటేల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ను స్టీల్ ఫ్రేం అన్నారు. మరి ఆ స్టీల్ ఫ్రేం బలహీనపడిందా?' అని ఆయన ప్రశ్నించారు. అధికారులంతా సమయపాలన పాటిస్తేనే లక్ష్యాలను చేరుకోగలమని ఆయన సుతిమెత్తగా మొట్టారు.