: పారిస్ లో మరో ఉగ్రదాడి... ఈసారి పోలీసులే లక్ష్యం!


ఫ్రాన్స్ లో మరో మూడు రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఉగ్రదాడి చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా ఫ్రాన్స్ లో ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అనుచరులు ఏదో ఒక రూపంలో ఫ్రాన్స్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ట్రక్కుతో దూసుకొచ్చిన ఉగ్రవాది...పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. రద్దీగా ఉన్న ప్రాంతం కావడంతో పోలీసులు వేగంగా స్పందించే అవకాశం లేకపోయినట్టు తెలుస్తోంది. ఒక భద్రతాధికారిని కాల్చి చంపిన ఉగ్రవాది, మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఉగ్రదాడి తమ సంస్థ పనే అని ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ ప్రకటించింది. దీంతో పోలీసులు ఫ్రాన్స్ లో భద్రతను పెంచారు. 

  • Loading...

More Telugu News