: ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన యాంకర్ డ్రెస్సునే తదేకంగా చూసిన కోహ్లీ!


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత అర్చనా విజయ వెళ్లిన సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అర్చనా విజయ కెమెరా వైపు చూస్తూ మాట్లాడుతుండగా, కోహ్లీ మాత్రం ఆమె ధరించిన జీన్స్ ప్యాంట్ నే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది. అయితే, ఈ ఫొటోపై నెటిజన్లు మాత్రం తమ దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఫ్యాషన్’గా ఉండటాన్ని ఇష్టపడే కోహ్లీ .. అందుకే, తదేకంగా చూశాడని కొందరు .. కోహ్లీ ప్రేయసి అనుష్కశర్మ కనుక ఈ ఫొటోను చూస్తే నవ్వుకుంటుందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

  • Loading...

More Telugu News