: ట్విట్టర్ లో ఫిర్యాదులకు మంత్రి నారా లోకేష్ స్పందన!
ట్విట్టర్ ద్వారా ప్రజలు చేసిన ఫిర్యాదులకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఫిర్యాదు చేసిన వారిని తమ ఫోన్ నంబర్, వివరాలు పంపాలని కోరారు. కాగా, తమ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా వుందని ట్విట్టర్ ద్వారా లోకేష్ కు విన్నవించుకున్నారు. ఆయా సమస్యలను తన దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలని, సత్వరమే పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు లోకేష్ హామీ ఇచ్చారు. కాగా, లోకేశ్ స్పందనకు ఆయా ఫిర్యాదుదారులు తమ సంతోషం వ్యక్తం చేశారు.