: బొంతల్లో కోట్ల రూపాయలు దాచి పట్టుబడ్డ అధికారి!
బ్యాంకుల్లో నగదు విత్ డ్రా పరిమితులను ఎత్తేసి ఎన్నో రోజులు అవుతున్నప్పటికీ, ఖాతాదారులు అడిగినంత ఇవ్వడానికి బ్యాంకు సిబ్బంది ఒప్పుకోవడం లేదు. అయితే, నల్లకుబేరుల వద్దకు మాత్రం కావలసినంత సొమ్ము వచ్చిపడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సేల్స్ ట్యాక్స్ అదనపు కమీషనర్ కేశవ లాల్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా ఏకంగా 18 కోట్ల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లు, రెండు కిలోల బంగారం బయటపడ్డాయి. ఆ డబ్బంతా ఆ అధికారి బొంతల్లోనూ, అల్మారాల్లోనూ దాచి ఉంచాడని అధికారులు తెలిపారు. ఆయనకు సంబంధించి నోయిడా సహా ఇతర నగరాల్లో ఉన్న స్థిరాస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇక ఆయన బ్యాంకు లాకర్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేస్తామని చెబుతున్నారు.