: బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉంది: మమతా బెనర్జీ


భారతీయ జనతా పార్టీతో ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి ముప్పు లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఈ రోజు ఆమె భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో మమత మాట్లాడుతూ, రాజకీయాల గురించి తాము చర్చించలేదని, మర్యాదపూర్వకంగా మాత్రమే ఆయన్ని కలిశానని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శల వర్షం కురిపించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందని అన్నారు. రాజకీయపార్టీలనే కాకుండా ప్రజలనూ బీజేపీ విభజిస్తోందని ఆమె మండిపడ్డారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగానే ఒడిశా సీఎంను ఆమె కలిసినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News