: అనిల్ కపూర్ తన మైనపు విగ్రహం పక్కనే ఇలా పోజిచ్చాడు!
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం పక్కనే నిలబడి ఫొటోకు పోజిచ్చాడు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్. సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తన మైనపు విగ్రహాన్ని అనిల్ కపూర్ తనివి తీరా చూసుకున్నాడు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోను పోస్ట్ చేశాడు. ‘సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసినన మైనపు విగ్రహం పక్కన నిలబడి పోజిచ్చా....ఇదో అద్భుతమైన అనుభవం...’ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.