: అహ్మదాబాద్ లో ‘బాహుబలి-థాలి’ రెడీ!


‘బాహుబలి-2’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఈ చిత్రం పేరిట తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందించి క్యాష్ చేసుకుంటున్న వారు కూడా వున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్ లోని రాజువాడు రెస్టారెంట్ ‘బాహుబలి-థాలి’ పేరిట ఓ మెనూని సిద్ధం చేసింది. ఈ మెనూలో వంటకాలు చాలానే ఉన్నాయి.

సాధారణంగా అయితే, థాలిలో పలు రకాల వంటకాలను ఎంచుకునే అవకాశం ఉండదు. కానీ, ‘బాహుబలి-థాలి’లో మాత్రం రాజస్థానీ, గుజరాతీ వంటకాలను రుచి చూపిస్తోంది. ఈ సందర్భంగా ఆ రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ, ‘బాహుబలి’ బృందం తమ రెస్టారెంటులో ఆతిథ్యం స్వీకరించాలని కోరుకుంటున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News