: ఏపీలో ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తాం: డీజీపీ సాంబశివరావు
ఏపీలో ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని డీజీపీ సాంబశివరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన రెండు రోజుల పర్యటన ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో రూ.50 లక్షలతో సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని, త్వరలో రూ.25 కోట్లతో పోలీస్ వాహనాలు కొనుగోలు చేస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం నిమిత్తం స్టేషన్లను పరిశీలిస్తున్నానని, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖతో కలిసి చర్యలు చేపడతామన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ప్రమోషన్ల జాబితాను తయారు చేయాలని ఈ సందర్భంగా సాంబశివరావు ఆదేశించారు.