: ఇంజక్షన్ చేయించుకున్న గంట లోపే మహిళా ఎంపీపీ మృతి.. బంధువుల ఆందోళన!


గుడివాడకు చెందిన మహిళా ఎంపీపీ వరలక్ష్మి ఓ ఇంజక్షన్ చేయించుకున్న గంట వ్యవధిలోనే మృతి చెందారు. మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్య క్షేత్రం షిర్డీ వెళ్లేందుకు ఆమె కుటుంబం నిర్ణయించుకుంది. అయితే, నెలసరి రాకుండా ఇంజక్షన్ చేయించుకునేందుకు గుడివాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆమె వెళ్లారు. ఈ ఇంజక్షన్ చేయించుకున్న తర్వాతే వరలక్ష్మి చనిపోయినట్టు ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. 

  • Loading...

More Telugu News