: ‘రాహుల్ అన్ ఫిట్’ అని సీనియర్ నేతలు భావిస్తున్నారు: ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆ పార్టీ మహిళా నేత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించేందుకు ‘రాహుల్ గాంధీ అన్ ఫిట్’ అని చాలా మంది సీనియర్ నాయకులు భావిస్తున్నారని ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ పై పలు ఆరోపణలు చేస్తూ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాసిన రాజీనామా లేఖలో పై వ్యాఖ్యలు చేశారు.

 పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులను అజయ్ మాకెన్ తిడుతున్నారని, బెదిరిస్తున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన ఆమె, ఇంత జరుగుతున్నా.. రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదని, పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తారనే భయంతో ఆయన దాక్కుంటున్నారా? అని బర్ఖా శుక్లా సింగ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేదని, రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసమే మహిళా సాధికారతను వాడుకుందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News