: మరో కీలక నిర్ణయం తీసుకున్న యోగి ఆదిత్యనాథ్
వరుస సంచలన నిర్ణయాలతో అతి తక్కువ కాలంలోనే దేశ వ్యాప్తంగా పాప్యులర్ ఇమేజ్ సంపాదించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర స్థలాలుగా భావిస్తున్న అన్ని ప్రదేశాలలో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి వెంటనే నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. కేవలం హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాలే కాకుండా, ముస్లిం ఇతర మతాలకు చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లో సైతం ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయోధ్య, బృందావన్, చిత్రకూట్, దేవ షరిఫ్, పిరాన్ కలియార్, దేవ్ బంధ్ తదితర ప్రాంతాల్లో మద్య నిషేధం అమలు కానుంది.