: రాజ‌కీయాల గురించి గ‌వ‌ర్న‌ర్‌తో మాట్లాడ‌లేదు: తంబిదురై


తమిళనాడులో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం దిశగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్‌ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎం.తంబిదురై ఈ రోజు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావుని క‌లిశారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ వద్ద‌కు ఆయ‌న ఏదో పెద్ద ప‌ని మీదే వెళ్లార‌ని అంతా అనుకున్నారు. అయితే, గ‌వర్న‌ర్‌తో త‌న భేటీపై స్పందించిన తంబిదురై  తాను మర్యాదపూర్వంగానే ఆయ‌న‌ను కలిశానని అన్నారు. తాను రాజ‌కీయాల గురించి గ‌వ‌ర్న‌ర్‌తో మాట్లాడ‌లేద‌ని ఆయ‌న అన్నారు.  మ‌రోవైపు ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాల విలీనం జ‌ర‌గాలంటే అంత‌కు ముందే శ‌శిక‌ళ, దిన‌క‌ర‌న్‌ల‌ను పార్టీ నుంచి అధికారికంగా బ‌హిష్క‌రించాల‌ని ప‌న్నీర్ వ‌ర్గం డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News