: పళనిస్వామి వర్గంపై పన్నీర్ సెల్వం వర్గం ఫైర్!
తమిళనాడు రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరిగాయి. శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి పక్కన పెట్టే దిశగా ఇప్పటిదాకా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య జరిగిన చర్చలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. ఇరువర్గాలు కలసిపోయాయి, ప్రకటన వెలువడటమే ఆలస్యం అనుకున్న తరుణంలో... పరిస్థితి మళ్లీ ముందుకే వచ్చింది. తమపై పళనిస్వామి వర్గం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ పన్నీర్ సెల్వం వర్గీయులు మండిపడుతున్నారు. చర్చల సందర్భంగా తాము ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని వీరు అంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవులను తాము అడగలేదని... అమ్మ జయలలిత మృతిపై విచారణ జరిపించాలని మాత్రమే అడుగుతున్నామని పన్నీర్ వర్గ నేతలు చెబుతున్నారు. శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలనేదే తమ అభిమతమని చెప్పారు. ఎంపీ తంబిదురై, మంత్రి జయకుమార్ లు పరిపక్వత లేని నేతల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.