: జగన్ దర్శకత్వంలో రోజా ‘జబర్దస్త్-2’ : బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్
ఏపీ మంత్రి నారా లోకేశ్ గురించి చెప్పాలంటే.. ‘జబర్దస్త్’ షో కూడా సరిపోదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజాకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ దర్శకత్వంలో రోజా ‘జబర్దస్త్-2’ చేస్తున్నారని విమర్శించారు. జగన్, రోజాలు 420 లని, ఇటువంటి వాళ్లా చంద్రబాబుని విమర్శించేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన నాటి నేతలు కొండా సురేఖ, సబ్బం హరి, కొణతాల రామకృష్ణలను జగన్ ఎలా అయితే మోసం చేశారో రోజాను కూడా అలాగే మోసం చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.