: జగన్‌ది సైకో మెంటాలిటీ: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ది సైకో మెంటాలిటీ అని, ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్ కి దమ్ముంటే పులివెందుల సీటు ఖాళీ చేయాలని, తమ యువనేత నారా లోకేశ్ ఆ స్థానంలో పోటీ చేసి గెలుస్తారని ఆయన సవాలు విసిరారు. నారా లోకేశ్ గురించి చెప్పాలంటే, జబర్దస్త్ కామెడీ షో కూడా సరిపోదంటూ విజయవాడలో ఈ రోజు ఎద్దేవా చేసిన రోజా కామెంట్లపై స్పందించిన ఆయన... జబర్దస్త్ షో చేయడం కోసమే రోజాను జగన్ విజయవాడకు పంపుతున్నారని చురకలంటించారు.