: చెట్టు నరికేశాడట... బాలీవుడ్ నటుడు రిషి కపూర్‌కు షోకాజ్ నోటీసులు!
తాను ఇల్లు కట్టించుకున్న స్థలంలో ఓ పెద్ద వృక్షం అడ్డుగా ఉండడంతో దానిని తొలగించిన బాలీవుడ్ నటుడు రిషి కపూర్‌కు బీఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో ఆయన ఇల్లు కట్టించుకుంటుండగా చెట్టును నరకడం కోసం అనుమతులు తీసుకున్నారు. అయితే, అనుమతులు వచ్చిన దానికంటే రిషికపూర్ ఇంటి స్థలం వద్ద చెట్టును ఎక్కువగా నరికేశారు. దీంతో రిషికి, ఆయన కాంట్రాక్టర్‌కి నోటీసులు అందాయి. ఈ చర్య చాలా పెద్ద తప్పని, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బీఎంసీ తెలిపింది. తనకు వచ్చిన నోటీసులపై స్పందించిన రిషికపూర్ ఆ ఇల్లు కడుతున్న సమయంలో తాను అక్కడ లేనని, తనకు అసలు చెట్టు నరికేసిన విషయమే తెలియదని అన్నాడు. తనపై పలువురు కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారని, తాను ఈ విషయమై త్వరలోనే ముగింపు ఇస్తానని వ్యాఖ్యానించాడు.