: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వడదెబ్బకు 37 మంది మృతి


భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతిరోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం, కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 45 డిగ్రీలు దాటి న‌మోద‌వుతుండ‌డంతో మ‌ధ్యాహ్నం వేళల్లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు ఇప్ప‌టివ‌ర‌కు 37 మంది మృతి చెందిన‌ట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 9 మంది మృతి చెందిన‌ట్లు వివ‌రించారు. కాగా, వడదెబ్బతో నిన్న ఒక్క‌రోజే తెలంగాణ‌లో 9 మంది మృతి చెందారని చెప్పారు. రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని, ఐస్‌ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌, 108 సర్వీసులను అందుబాటులో ఉంచాలని విపత్తు నిర్వ హణ శాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి విడుద‌ల చేసింది.

  • Loading...

More Telugu News