: పెళ్లైన కొన్ని రోజులకే యువతి ఆత్మహత్య... భార్యలేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య


చేవెళ్లలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో వచ్చిన మనస్పర్థలతో పెళ్లైన కొన్ని రోజులకే ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా... త‌న భార్య మృతిపై మ‌న‌స్తాపంతో భ‌ర్త‌ కూడా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు(23)కు గ‌త ఏడాది వివాహం జ‌రిగింది. అయితే, పెళ్లైన కొన్ని రోజుల‌కే ఆయ‌నతో గొడ‌వ‌లు రావ‌డంతో భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అంజనేయులు తన తల్లి చంద్రమ్మతోపాటు కొన్ని రోజుల కిత్రం చేవెళ్లకు వచ్చి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు.

ఆయ‌న ఆ ప్రాంతంలోనే తాపీమేస్త్రీ వద్ద కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన ఆంజనేయులు మధ్యాహ్నం ఇంటికి వచ్చి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బ‌య‌టికి వెళ్లి వ‌చ్చిన అతడి తల్లి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో స్థానికులకు ఆమె ఈ విష‌యం చెప్ప‌డంతో వారంతా క‌లిసి పోలీసులు స‌మాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు ఆంజ‌నేయులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి జేబులో ఆత్మహత్య లేఖ ల‌భ్య‌మైంద‌ని, భార్య లేద‌నే మ‌న‌స్తాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడ‌ని పోలీసులు వివ‌రించారు.

  • Loading...

More Telugu News