: చొక్కాలు, ప్యాంట్లు తీసేసి మరీ ప్రాక్టీస్ చేసుకున్న పంజాబ్ ఆటగాళ్లు... మీరూ చూడండి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంత స్టేడియంలో సాయంత్రం 8 గంటలకు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని కసిగా ప్రాక్టీస్ చేస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ లలో ఒటమిపాలైన మ్యాక్స్ వెల్ సేన... సొంత గడ్డపై హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తీవ్రంగా సాధన చేస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నారు. సూర్యుడు భగభగలతో బెంబేలెత్తించడంతో ఇతరుల సంగతి దేవుడెరుగు కానీ విదేశీ ఆటగాళ్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. తెల్లవారు జామున జరిగే ప్రాక్టీస్ సెషన్లలో ఆటగాళ్లు ప్యాంట్లు, షర్టులు తీసేసి పాల్గొన్నారు.