: ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు


ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ముగ్గురు ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జలంధర్ లో ఒకరు, ముంబైలో మరొకరు, బిజ్నోర్ లో ఇంకొకరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఐదు రాష్ట్రాల పోలీసులతో యూపీ ఏటీఎస్, ఢిల్లీ పోలీసులు కార్యాచరణ రూపొందించారు. అనంతరం ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నారు. కాగా, బంగ్లాదేశ్ నుంచి భారీ ఎత్తున ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించారని, వివిధ ప్రాంతాల్లో వారు మకాం వేశారని బంగ్లాదేశ్ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News