: హాట్ బ్యూటీ పూనమ్ పాండే యాప్ ను బ్యాన్ చేసిన గూగుల్


తన బోల్డ్ ఫోటోలతో కుర్రకారుకు కిక్కిచ్చే పూనమ్ పాండే గుర్తుందా? వరల్డ్ కప్ లో భారత జట్టు గెలిస్తే, టాప్ లెస్ పోజులిస్తానని చెప్పిన ఈ అమ్మడు, తాజాగా తన కోసం తయారు చేసుకున్న యాప్ ను విడుదల చేయగా, ఆపై నిమిషాల వ్యవధిలోనే గూగుల్ దానిపై నిషేధాన్ని విధించింది. అంతకుముందు పూనమ్ మాట్లాడుతూ, తనకు ఏజన్సీగా పని చేస్తున్న రేజర్ కార్ప్ ఈ యాప్ ఆలోచనతో వచ్చిందని, అది తనకు నచ్చిందని తెలిపింది.

ఆపై ఈ యాప్ ను తనకు నచ్చినట్టుగా తయారు చేయించుకున్నానని, తాను బోల్డ్ గా ఉంటానని అనుకునే వారెవరికైనా, తన యాప్ కూడా అలాగే కనిపిస్తుందని చెప్పింది. తన వెబ్ సైట్ నుంచి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇక ఈ యాప్, తమ నిబంధనలకు అనుగుణంగా లేదని, అభ్యంతర కంటెంట్ ఎక్కువగా ఉందని చెబుతూ గూగుల్ దీనిపై వేటు వేసింది.

  • Loading...

More Telugu News