: ఒక్క కుమారుడితోనే చంద్రబాబు సరిపెట్టుకోవడానికి కారణం ఇదే!


రాజకీయాల్లో చాలా బిజీగా ఉండటంతో... ఒక్క బిడ్డ మాత్రమే చాలనుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తన భార్య, తండ్రి కూడా తన నిర్ణయంతో ఏకీభవించారని చెప్పారు. అయితే మా అత్తగారు మాత్రం మా నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలిపారు. బిజీ వల్ల ఇద్దరు సంతానం వద్దనుకున్నామని... లోకేష్ తోనే సరిపెట్టుకున్నామని  చెప్పారు. లోకేష్ స్టాన్ ఫోర్డ్ లో చదువుతున్నప్పుడు తనకు అతని పెళ్లి గురించి ఆలోచన వచ్చిందని బాబు తెలిపారు. ఆ తర్వాత తన భార్యతో చర్చించానని... అనంతరం బాలయ్యను కదిపామని చెప్పారు. అయితే, బ్రహ్మణి చదువుకోవాలని ఆయన చెప్పడంతో... ఆయనను కన్విన్స్ చేయడానికి కొంచెం సమయం పట్టిందని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ విషయాను వెల్లడించారు.

  • Loading...

More Telugu News