: 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తించిన ముస్లిం ఉన్నతాధికారి
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే నిమిత్తం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హఫీజ్ ఉస్మాన్, తన చేతులు పైకెత్తి 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. ఆపై ప్రజలతో కూడా 'జై శ్రీరామ్' అనిపించారు. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించిన ఏకైక దేశం ఇండియానే అని, ట్రిపుల్ తలాక్ కాదు కదా, ఒక్క తలాక్ చెప్పినా తప్పేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన హఫీజ్, 'భారత్ మాతాకీ జై' అని కూడా నినాదాలు చేశారు. సౌదీ అరేబియా విధించిన సెన్సార్ షిప్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఓ అధికార కార్యక్రమంలో మతపరమైన అంశాలు లేవనెత్తి, ఓ మతానికి అనుకూల నినాదాలు చేయడంపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.