: ముఖ్యమంత్రి గారూ మేము సిద్ధం...మీరు సిద్ధమా?: చంద్రబాబుకు సినీ నటుడు శివాజీ బర్త్ డే సవాల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సినీ నటుడు శివాజీ సరికొత్త సవాల్ విసిరాడు. పుట్టిన రోజున చంద్రబాబునాయుడు గారికి ఒక సవాల్ విసురుతున్నానని ఆయన అన్నారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని చెబుతున్న చంద్రబాబునాయుడు గారు ఎంచుకున్న మనుషులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని శివాజీ తెలిపాడు. ఈ సవాల్ స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు.
ప్రత్యేకహోదా, ప్యాకేజీకి ఏమొస్తుందో తెలియని రాజకీయ నాయకులు రెండింటికి మధ్య తేడాలు పూర్తిగా తెలిసినట్లు, హోదాలో అంశాలపై పూర్తి అవగాహన ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దయచేసి అలాంటి మాటలు, ప్రకటనలు ఆపాలని ఆయన సూచించారు. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చితీరుతుందని, అది వచ్చిన రోజున మీ మేధావితనం చూసి ప్రజలు నవ్వుకుంటారని, అలా నవ్వులపాలు కావద్దని ఆయన హెచ్చరించారు.