: పెళ్లి సమయంలో మా నాన్నను కూడా తోసేశారు: చంద్రబాబు


ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన పెళ్లి సమయంలో జరిగిన ఓ ఘటన గురించి వివరించారు. పెళ్లి సమయానికే తాను మంత్రిని కావడం, ఎన్టీఆర్ ప్రముఖ నటుడు కావడంతో... జిల్లాలో అందరికీ శుభలేఖలు పంచామని చెప్పారు. పెళ్లి చెన్నైలో జరిగిందని... చెన్నై దగ్గరగా ఉండటంతో భారీ ఎత్తున బంధుమిత్రులు పెళ్లికి తరలి వచ్చారని తెలిపారు. కేబినెట్ మొత్తం వచ్చిందని, ఎంజీఆర్ లాంటి స్టార్లు వచ్చారని చెప్పారు. దీంతో, పెళ్లిలో విపరీతమైన సందడి నెలకొందని... రద్దీ ఎక్కువ కావడంతో, అందర్నీ తోసివేశారని అన్నారు. ఈ సందర్భంగా మా నాన్నను కూడా తోసేశారని చెప్పారు. అయితే పెద్దాయన (ఎన్టీఆర్) వెళ్లి, క్షమాపణ చెప్పి తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News