: బోల్డ్ గా నటించే రాధికా ఆప్టేకి ఇప్పటికీ కెమెరా అంటే భయమట!
అహల్య, పార్చడ్, బద్లాపూర్ వంటి సినిమాల్లో బోల్డ్ సీన్లలో నటించి కలకలం రేపిన రాధికా ఆప్టే ఇప్పటికీ తనకు కెమెరా ముందుకు వెళ్లాలంటే భయమని చెబుతోంది. సినిమాల నుంచి తాను సులువుగా విరామం తీసుకోగలనని తెలిపింది. అప్పుడప్పుడు సినిమాల నుంచి విరామం తీసుకుని పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ చేయడం చేస్తానని తెలిపింది. అలా అయితే రిఫ్రెష్ అయి మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా కెమెరా ముందుకు వెళ్లాలంటే భయంగానే ఉంటుందని చెప్పింది. ఈ ఫీలింగ్ తనకు 60 ఏళ్లు వచ్చినా ఇలాగే ఉంటుందని పేర్కొంది. అలాగే ఒక పాత్రను ఎంచుకున్నప్పుడే దానికి న్యాయం చేయగలమా? లేదా? అన్నది ఆలోచించుకోవాలని రాధికా ఆప్టే సూచించింది.