: పని వాళ్ల పట్ల బాలీవుడ్ సెలబ్రిటీల బాగోతాలివి... బయటపెట్టిన స్టార్టప్ సంస్థ


గృహావసరాల నిమిత్తం పని మనుషులను సరఫరా చేసే సేవలందిస్తున్న స్టార్టప్ సంస్థ 'బుక్ మై బాయ్' సంచలన విషయాలు బయటపెట్టింది. బాలీవుడ్ ప్రముఖులు తమ పని మనుషులకు నరకం చూపిస్తున్నారని, తన అధికార బ్లాగ్ లో సవివరంగా పేర్కొంది. తమ తమ ఇళ్లలో పని చేసేవారిపట్ల సెలబ్రిటీలు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారని, కొందరి కారణంగా ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీలెవరికీ పని మనుషులను పంపకుండా తమపై తామే నిషేధం విధించుకున్నామని పేర్కొంది. సెలబ్రిటీల వేధింపుల కారణంగా పనివాళ్లు నరకం అనుభవిస్తున్నారని వెల్లడించింది. ప్రత్యేకించి ఎవరి పేర్లనూ వెల్లడించని సంస్థ పలు ఘటనలపై విచారణ అనంతరం బాలీవుడ్ ను పక్కన పెట్టినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News