: అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే ఎర్రబుగ్గ తీసేశా: స్మృతీ ఇరానీ
నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ తీసుకున్న 'ఎర్రబుగ్గపై నిషేధం' నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, తన కారుపై ఎర్రబుగ్గను తొలగించారు. మే 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుండగా, ప్రతి ఇండియన్ వీఐపీయేనన్న బీజేపీ నమ్మకాన్ని పునరుద్ధాటించామని చెబుతూ, అప్పటిదాకా ఆగకుండా ఇప్పుడే ఎర్రబుగ్గను తొలగించినట్టు తెలిపారు. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నసీస్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ లు కూడా తమ కార్లపై రెడ్ లైట్ ను తొలగించారు. గోవా, రాజస్థాన్, ఒడిశా ముఖ్యమంత్రులు మనోహర్ పారికర్, వసుంధరా రాజే, నవీన్ పట్నాయక్ లు సైతం వెంటనే తమ కార్లపై ఎర్రబుగ్గలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.