: సల్మాన్ ట్యూబ్ లైట్ ఫస్ట్ లుక్ వచ్చేసింది...అభిమానులను ఆకట్టుకుంటోంది
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ట్యూబ్ లైట్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. 'భజరంగీ భాయ్ జాన్', 'సుల్తాన్' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత నటిస్తున్న ’ట్యూబ్ లైట్’ ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సల్మాన్ ఖాన్ కు ’ఏక్ థా టైగర్’, ’బజరంగీ భాయ్ జాన్’ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అంశాలు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డ కబీర్ ఖాన్, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేశారు. దీపావళికి విడుదల కానున్న ఈ ‘ట్యూబ్ లైట్’ ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో సల్మాన్ పాత్రను వర్ణించే ప్రయత్నం చేశాడు కబీర్ ఖాన్...బూట్లు మెళ్లో వేసుకుని, అమాయకం నిండిన చూపులతో సల్లూభాయ్ ట్యూబ్ లైట్ ను తలపిస్తున్నాడు.