: మాతో ఆటలొద్దు: అమెరికాకు ఉత్తర కొరియా కఠిన హెచ్చరిక


దూకుడుగా వెళుతున్న ఉత్తర కొరియాను ఎలాగైనా అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్న వేళ, తమతో ఆటలు వద్దని ఆ దేశ అధికారిక మీడియా హెచ్చరించింది. తమతో పెట్టుకుంటే చావు దెబ్బ తప్పదని, దాడికి ప్రతిదాడి చేసేందుకు ఏ క్షణమైనా తాము సిద్ధమేనని పేర్కొంది. తూర్పు ఆసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తున్న అణు పరీక్షలను నిలువరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా మంత్రి రెక్స్ టిల్లర్ సన్ పేర్కొన్న నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ హెచ్చరికలు చేసింది. కాగా, ప్రస్తుతం ఆసియా దేశాల పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాతో ఇక వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న ఓపిక నశించిందని అన్నారు. ఏ దేశమూ అంగీకరించని పనులను కిమ్ జాంగ్ ఉన్ చేస్తున్నారని, ఇది అనర్థమని అన్నారు.

  • Loading...

More Telugu News