: అప్పట్లో ఆరు బయటే దుస్తులు మార్చుకోవాల్సి వచ్చేది: సినీ నటి రాశి
ఇప్పటి వరకు దాదాపు 75 సినిమాల్లో నటించిన నటి రాశి... ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆమె తాజాగా నటించిన చిత్రం 'లంక' శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. ఈ రోజుల్లో హీరోయిన్లకు అన్ని సదుపాయాలు ఉన్నాయని... కార్ వ్యాన్ లు ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని చెప్పింది. తాము హీరోయిన్లుగా చేసే రోజుల్లో ఈ సౌకర్యాలు ఉండేవి కావని... షూటింగ్ విరామంలో ఏ చెట్టు కింద నీడ ఉందా అని వెతుక్కునేవాళ్లమని తెలిపింది. చెట్ల కిందే ఫ్యాన్ లు, కూలర్లు పెట్టుకుని కూర్చునేవారమని చెప్పింది. ఊటీలాంటి ప్రాంతాలకు ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లినప్పుడు ఆరుబయటే దుస్తులు మార్చుకోవాల్సి వచ్చేదని తెలిపింది. ఇప్పటి హీరోయిన్లకు ఈ బాధలు లేవని చెప్పింది.