: రవీంద్ర జడేజా హెయిర్ స్టైల్ చూసి పడిపడి నవ్విన కోహ్లీ
ఐపీఎల్ సీజన్-10కు సరికొత్త హెయిర్ స్టైల్ తో వచ్చిన రవీంద్ర జడేజాను చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పడిపడి నవ్వాడు. అలా నవ్వుతుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విభన్నమైన హెయిర్ స్టైల్ తో పాటు గడ్డాన్ని కూడా విభిన్నంగా స్టైల్ చేయించుకున్ని రవీంద్ర జడేజాను బెంగళూరు, గుజారాత్ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కోహ్లీ చూశాడు.
దీంతో ప్రాక్టీస్ ను కాసేపు పక్కనబెట్టి గుజరాత్ జట్టు దగ్గరకు వచ్చి జడేజాను తేరపార చూశాడు. ఈ సమయంలో ఆటగాళ్లంతా కోహ్లీని పలకరించగానే... జడేజాను విచిత్రమైన స్టైల్ లో చూసిన కోహ్లీ పడిపడి నవ్వాడు. కోహ్లీకి ప్రవీణ్ కుమార్ కూడా జతకలిశాడు. వారిద్దరూ నవ్వుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే అండర్ 19 భారత జట్టుకు ఆడినప్పటి నుంచి కోహ్లీ జడేజా స్నేహితులు.