: అమెరికాపై అణుబాంబు వేస్తే వినాశనం ఇలా ఉంటుంది!.. వీడియోలో చూపించిన ఉత్తరకొరియా
అమెరికాపై ఉత్తరకొరియా అణుబాంబు వేస్తే ఎలా ఉంటుంది? ఆ వైనాన్ని గ్రాఫిక్స్‌తో రూపొందించిన వీడియోలో కళ్లకు కట్టినట్టు చూపించింది ఉత్తరకొరియా. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ 2 సంగ్ గౌరవార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వీడియోను ప్రదర్శించారు. ఉత్తరకొరియా వరుసపెట్టి సంధించిన క్షిపణలు దెబ్బకు అమెరికాలోని పలు నగరాలు మంటల్లో చిక్కుకున్నట్టు ఆ వీడియోలో చూపించారు. చివరికి కాలిపోతున్న అమెరికా జెండాతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోను చూసిన వారు ఆనందంతో కరతాళ ధ్వనులు చేసినట్టు స్థానిక మీడియా పేర్కొంది. సైనికుల ఆనందాన్ని చూసి అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా సంతోషం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కాగా, ఇటువంటి వీడియోలను విడుదల చేయడం ఉత్తరకొరియాకు ఇదేం తొలిసారి కాదు. 2013, 2016లోనూ ఇటువంటి వీడియోలనే ప్రదర్శించింది.