: నోయిడాలోని కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం


నోయిడాలోని ఎక్సెల్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. నాలుగంతస్తుల భవనంలోని ఎల్‌ఈడీ ప్యాకింగ్ ఆఫీస్‌లో మూడో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకిన మరో కార్మికుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కంపెనీలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందిలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో 15 మంది ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మొదలైన మంటలు నాలుగు గంటలపాటు ఎగసిపడ్డాయి.

ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం ఆరుగురు మరణించారని, ముగ్గురి మృతదేహాలు గుర్తించినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ దాస్ (45) తెలిపారు. భవనంలో మరింతమంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నామని, వారి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తలుపులు ఆటోమెటిక్‌గా మూసుకుపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కుల్దీప్ యాదవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News