: సమంత తెలంగాణ చేనేత రాయబారే...కేటీఆర్ గుర్తించారు: చేనేత సహకార సంస్థ ఎండీ
చేనేత రాయబారిగా సినీనటి సమంత సేవలను వినియోగించుకుంటున్నామని రాష్ట్ర చేనేత సహకార సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ చెప్పారు. సినీ నటి సమంత చేనేత రాయబారి కాదంటూ నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని అందులో పేర్కొన్నారు. ఈ వార్తలపై స్పందించిన తెలంగాణ చేనేత సహకార సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, సమంత తెలంగాణ చేనేత రాయబారి కాదన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు సమంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, ఆమెను మంత్రి కేటీఆర్ రాయబారిగా గుర్తించారని తెలిపారు. ఈ మేరకు ఆమెతో అధికారికంగా త్వరలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటించారు.