: రూ.4 కోట్లకు అమ్ముడుపోయిన 1948 నాటి నాలుగు గాంధీ స్టాంపులు!


1948 నాటి నాలుగు గాంధీ స్టాంపులు ఏకంగా రూ.4.144 కోట్ల (5 లక్షల పౌండ్లు)కు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మహాత్మాగాంధీ బొమ్మతో విడుదల చేసిన  పది రూపాయల విలువైన ఈ నాలుగు స్టాంపులను ఎంతో విలువైనవిగా పరిగణిస్తున్నట్టు బ్రిటన్‌కు చెందిన డీలర్  స్టాన్లీ గిబ్బన్స్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్పల్-బ్రౌన్ కలర్‌లో ఉన్న ఈ స్టాంపులపై ‘సర్వీస్’ అన్న పదం ముద్రించి ఉంది. అప్పటి గవర్నర్ జనరల్ కార్యాలయ ఉపయోగం కోసం వీటిని ముద్రించారు. వీటిని తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్టర్ కొనుగోలు చేశారు. గతేడాది సింగిల్ స్టాంప్‌ను ఉరుగ్వేకి చెందిన ఓ వ్యక్తికి రూ.1.32 కోట్ల (1.60 లక్షల పౌండ్లు)కు విక్రయించినట్టు గిబ్బన్స్ తెలిపారు.

  • Loading...

More Telugu News