: ధర్మయుద్ధంలో తొలి విజయం ఇది.. పన్నీర్ సెల్వం


అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబాన్ని బహిష్కరించడం, రెండుగా విడిపోయిన అన్నాడీఎంకే మళ్లీ ఒక్కటి కానున్న నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హుషారుగా ఉన్నారు. వీలైనంత త్వరగా విలీనాన్ని పూర్తిచేసేందుకు తన వర్గం నేతలు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను చేస్తున్న ధర్మయుద్ధంలో తొలి విజయం లభించిందని పేర్కొన్నారు. జయలలిత మృతి తర్వాత పార్టీని హస్తగతం చేసుకున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యులను తరిమికొట్టేంత వరకు తన పోరాటం ఆగదని ప్రకటించానని గుర్తు చేసిన ఆయన, అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబం దూరం కావడం తాము చేస్తున్న ధర్మయుద్ధంలో లభించిన తొలి విజయమని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు తన లక్ష్యం నెరవేరిందని, విడిపోయిన రెండు వర్గాలు వీలైనంత త్వరగా ఏకతాటిపైకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News