: ట్యాంకులోంచి కారిపోతోన్న మంచి నూనె.. పట్టుకునేందుకు ఎగబడ్డ స్థానికులు
కర్ణాటకలోని గుల్బర్గాలో ఈ రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంత వాసులంతా ఒక్కసారిగా బకెట్లు, బిందెలతో రోడ్డుపైకి పరుగులు తీశారు. వారి పరుగులకి కారణం ఏంటని ఆరాతీస్తే.. వారంతా బిందెలతో ఓ ట్యాంకర్ వద్దకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో ట్యాంకు చుట్టూ చేరి అందులోంచి కారుతున్న మంచి నూనెను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. మంచి నూనెను తీసుకెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడడంతో దానిలోంచి లీటర్ల కొద్దీ నూనె లీకయిపోయి రోడ్డుపై పడిపోతోంది. దాన్ని తెచ్చుకునేందుకే స్థానికులు ఇలా బారులు తీరారు.