: రిలయన్స్ జియో 448 జీబీ ఉచిత డేటా ఆఫర్!


ద‌క్షిణ కొరియా మొబైల్ ఉత్ప‌త్తుల దిగ్గ‌జ సంస్థ శాంసంగ్ నుంచి ఈ రోజు మార్కెట్లోకి కొత్తగా గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ విడుద‌ల‌య్యాయి. గెలాక్సీ ఎస్8 ధర రూ.57,900 కాగా, గెలాక్సీ ఎస్8 ప్లస్ ధర రూ.64,900గా ఉంది. ఈ మొబైళ్ల‌ను కొనుగోలు చేస్తోన్న వారికి రిల‌య‌న్స్‌ జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి 448జీబీ 4జీ డేటాను 8 ఎనిమిది నెలల పాటు అందించనున్నట్టు జియో తెలిపింది.

ఇందుకోసం నెలకు రూ.309తో రీఛార్జ్ చేసుకోవాల‌ని తెలిపింది. ప్ర‌స్తుతం మార్కెట్లో జియో ధన్ ధనా ధన్ ఆఫ‌ర్ ఉన్న విష‌యం తెలిసిందే. ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ యూజ‌ర్లు ఈ ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్ (నెలకు 28 జీబీ డేటా ఫ్రీ) కు రెండు రెట్లు డేటాను అందుకోవ‌చ్చు. వీరికి నెలకు 56 జీబీ చొప్పున మొత్తం ఎనిమిది నెలల పాటు 448జీబీ అందుతుంది.

  • Loading...

More Telugu News