: గురక పెడుతున్న లక్ష్మణ్ తో యూవీ సెల్ఫీ!


ఐపీఎల్ పదో సీజన్ లోసన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు యువరాజ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జట్టుకు మార్గ నిర్దేశకుడిగా వీవీఎఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. అయితే, పలు జట్లతో తలపడే క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్లే నిమిత్తం జట్టు సభ్యులు విమాన ప్రయాణం చేస్తుండగా ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మణ్, సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ పక్కపక్క సీట్లలో కూర్చున్నారు.

ఈ క్రమంలో నిద్రలోకి జారుకున్న లక్ష్మణ్ .. చిన్నగా గురక పెట్టడం ప్రారంభించారు.ఈ విషయం మొత్తానికి యువీ చెవిన పడటంతో, చిన్నగా లేచి.. లక్ష్మణ్ సీటు వద్దకు వచ్చాడు. వచ్చిన వాడు సైలెంట్ గా ఉన్నాడా అంటే ఉండలేదు. ఎంచక్కా, ఓ సెల్ఫీ దిగి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పైగా, ‘వీవీఎస్ లక్ష్మణ్ గురక పెడుతున్నటువంటి చాలా ప్రత్యేకమైన దృశ్యాన్ని నేను, మురళీ సార్  ఎంజాయ్ చేస్తున్నాము’ అని తన పోస్టులో పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News