: తెలుగువారిపై నటుడు అజయ్‌ ఘోష్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు


తమిళ చిత్ర పరిశ్రమ ముందు తెలుగు సినీ ఇండస్ట్రీ ఎందుకూ పనికిరాదంటూ నటుడు అజయ్‌ ఘోష్ తీవ్ర వివాదాస్పదర వ్యాఖ్యలు చేశాడు. అజయ్ ఘోష్.. తెలుగులో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’, ‘డీకే బోస్‌’ వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దుర్భ‌ర ప‌రిస్థితులు త‌మిళ సినీ ఇండస్ట్రీలో లేవ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. టాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే కెమెరా ముందే కాకుండా కెమెరా వెనుక కూడా నటించాలని ఆయ‌న అన్నాడు. మరోవైపు తమిళ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
 
అంతేకాదు, తెలుగు వారిపై కూడా అజ‌య్ ఘోష్ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. తమిళనాడులో ఆటో డ్రైవర్‌ కూడా పేపర్‌ చదువుతూ కనబడతాడని పేర్కొన్న ఆయ‌న‌.. ఏపీ, తెలంగాణ‌ల్లో మాత్రం గుట్కా, పాన్‌ నములుతూ కూర్చుంటారని అన్నాడు. ఇక‌ తమిళ సాంబారుని అమృతం అని, తెలుగురాష్ట్రాల్లో చేసే సాంబారు తింటే కడుపునొప్పి, మోషన్స్‌ వస్తాయని ప‌లు వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News